రాజీవ్‌ రహదారిలో లోపాలు ఉంటే కఠిన చర్యలు

సంగారెడ్డి, నవంబర్‌ 23 : రాజీవ్‌ రహదారి నిర్మాణంలో లోపాలు ఉంటే సంబంధించిన అధికారులపై చర్యలకు తీసుకుంటానమి అసెంబ్లీ హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ భాను ప్రసాద్‌ శుక్రవారం హెచ్చరించారు. మెదక్‌ జిల్లా ములుగు మండలం వంటి మామిడి వద్ద అసెంబ్లీ హౌస్‌ కమిటీ బృందం రాజీవ్‌ రహదారి డివైడర్లు, రహదారి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. రహదారి నిర్మాణ పనులలో అవకతవకులు ఉన్నట్టు తెలితే అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. హౌస్‌ కమిటీ చర్యలు తీసుకునే అధికారం లేదని ప్రభుత్వానికి తాము సిఫార్సు చేస్తామని తదుపరి నిర్ణయం ప్రభుత్వాదేనని విలేఖరుల అడిని ప్రశ్నకు సమాదానం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కనుమూరుపల్లి, కొడండ్ల గ్రామాల మధ్య నుంచి బైపాస్‌ రోడ్డు రాజీవ్‌ రహదారికి చేరేల నిర్మించాలని గ్రామస్థులు హౌస్‌లకు  సభ్యలకు తెలిపారు. అక్కడక్కడ దెబ్బతిన్ని రాజీవ్‌ రహదారి పనులపై కూడా గ్రామస్థులు బృందానికి వివరించారు. ఈ బృందంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎస్‌. ఇంద్రాసేనారెడ్డి,  ఫారుక్‌హూస్సేన్‌, గంగాధరగౌడ్‌, నారదాసులక్ష్మణరావు, చుక్కా రాములు, బి. మోహన్‌రెడ్డి, జగన్‌నాథ్‌రావు తదితరులు బృందంలో ఉన్నారు.