రాజీవ్ రహదారి ప్రమాదంలో 11మంది మృతి
తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్
గజ్వెల్ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
సిద్దిపేట,మే26(జనంసాక్షి): జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శనివారం గజ్వేల్ మండలం రిమ్మనగూడెం దగ్గర హైవేపై రెండు లారీలు, బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది చనిపోగా.. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ప్రమాద మృతుల సంఖ్య పెరగవచ్చని అంటున్నారు.
గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కంటెయినర్, లారీ, క్వాలిస్ వాహనాలు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. మంచిర్యాల డిపోకు చెందిన రాజధాని బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. లారీ, కంటెయినర్ మధ్య క్వాలిస్ వాహనం చిక్కుకుంది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, వైద్యసిబ్బంది,స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న లారీని అదుపుతప్పి ఢీకొట్టింది. బస్సు ఢీకొనడంతో అదుపు తప్పిన లారీ డివైడర్ దాటి అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. దీంతో అదే మార్గంలో ఎదురుగా వస్తున్న క్వాలిస్, దాని వెనక వస్తున్న కంటెయినర్‌ను లారీ ఢీకొట్టింది. లారీ, కంటెయినర్ మధ్య చిక్కొకొని క్వాలిస్ నుజ్జునుజ్జయింది. దీంతో క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ లక్ష్మణ్ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది మృతిచెందారు. ఈ రోడ్డు ప్రమాద ఘటన పట్ల సీఎం కేసీఆర్ దిగ్భాం/-రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు ప్రమాద ఘటనపై రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హావిూ ఇచ్చారు.