రాజీవ్ సేవలు మరువలేనివి: శంకర్ రావు
రంగారెడ్డి,మే21(జనం సాక్షి): దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరవలేనివని మాజీ మంత్రి శంకర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ 27 వ వర్ధంతి సందర్బంగా మాజీ మంత్రి శంకర్ రావు రాజీవ్ గాంధీ విగ్రాహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రజల కోసం, దేశ సమగ్రత, సమైక్యత కోసం పాటు పడ్డారని, ఆయన సేవలు మరవలేనివి అన్నారు.. కర్ణాటకలో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. రాబోయే కాలంలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారని అన్నారు. కాంగ్రెస్ విజయాలను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.