రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పలు సామాజిక కార్యక్రమంలు
జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( ఆగస్టు 20)
ఈరోజు ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆదేశాల మేరకు టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ సూచన మేరకు టి పి సి సి మైనార్టీ ఉపాధ్యక్షులు వహీద్ ఖాన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గత నాలుగు రోజుల నుండి సద్భావన దివస్ సందర్భంగా విద్యార్థులకు పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాల్లో గెలిచిన విద్యార్థులకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ విజేతలకు మెమోంటోలను అందజేయడం జరిగింది .వర్మ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ సేవ కొరకు తమ ప్రాణాలనే త్యాగం చేసినారు వారు 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పించినారు .వారి హయాంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందినది వారు చేసిన కార్యక్రమాలు ఇప్పటికికూడా ప్రజలు కనులతో చూస్తున్నారు వారి తర్వాత గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న పదవులను పక్కకుపెట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీ దేశంలో నిపుణులైన మన్మోహన్ సింగ్ ని ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డి సి సి మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తు ఇమామ్ డిసిసి మైనార్టీ కన్వీనర్ మొయినుద్దీన్ డీసీసీ మైనార్టీ ఉప అధ్యక్షులు పాషా ప్యాయజ్ సిద్ధిరాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.