రాజుల పాలన కాదని గుర్తుంచుకోవాలి: జీ జగదీశ్వర్ రెడ్డి
సంగారెడ్డిలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన నియతృత్వ ధోరణికి నిదర్శనమని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది రాజుల పాలన కాదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల హక్కు బయ్యారం ఉక్కును ఎలా కాపాడుకోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ద్రోహి అనే విషయాన్ని సీఎం మరోసారి నిరూపించుకున్నారని టీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. బయ్యారం ఉక్కును బలవంతంగా సీమాంధ్రకు తరలించుకుపోవటానికి అది సీఎం అబ్బసొత్తుకాదని మండిపడ్డారు. బయ్యారం ఉక్కును తరలిస్తే ఎంతకైనా తెగిస్తామన్నారు.