రాజ్యసభలో ఎంపిల ఆందోళన

న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హావిూలను కేంద్రం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీలు వి. హనుమంతరావు, జేడీ శీలంలు ఆందోళన వ్యక్తం చేశారు. వారిద్దరూ పోడియం వైపు దూసుకువెళ్లి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. బడ్జెట్‌లో తెలంగాణకు, అంధ్రాకు ఎలాంటి నిధులు కేటాయించలేదని వీహెచ్‌ ఆరోపించారు. వీరి ఆందోళనకు మరో కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌ మద్దతు పలికారు. గతంలో ఐదేళ్లు ప్రత్యేక ¬దా కల్పిస్తే పదేళ్లు అన్న వెంకయ్య ఇప్పుడు ఎందుకు మాట్లాడరని విహెచ్‌ అన్నారు. విభజన హావిూలను తుంగలో తొక్కారని అన్నారు. ఇక్కడ తెలంగానకు, అక్కడ ఎపికి న్యాయం జరగాలని అన్నారు.