రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కి ఆహ్వానం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని రవి మహల్ ఏసీ కన్వెన్షన్ హాల్ లో జరిగే ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రావాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ను ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు రాజా ఆహ్వానించారు.శుక్రవారం రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ను జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మీలా వంశీ , గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం,యామా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.