రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ

3

– ఆంధ్రాకు అన్యాయం జరిగిందన్న వాదనను తిప్పికొట్టిన టీఆర్‌ఎస్‌

న్యూఢిల్లీ,నవంబర్‌26(జనంసాక్షి):

రాష్ట్ర విభజన అంశం మరోమారు లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై తెలంగాణ, ఎపి ఎంపిలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పై ఎవర్నీ దూషించాల్సిన అసవరం లేదని తెరాస ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించేటప్పుడు తమ అభిప్రాయం వినలేదని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జితేందర్‌రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ దుర్వినియోగం జరిగిందన్న శ్రీకాకుళం లోక్‌సభ టీడీపీ ఎంపీ రాంమోహన్‌ వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి తిప్పికొట్టారు.  రాజ్యాంగ ముసాయిదా ఆమోదం పొందిన తేదీని పురస్కరించుకుని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతుత్సవాల్లో భాగంగా పార్లమెంట్‌ రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలను చేపట్టింది. ఈ సమావేశాల్లో భాగంగా రాజ్యంగ నిర్మాత కృషిని అభినందిస్తూ సభ్యులు ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యంగంపై వ్యాఖ్యానం చేస్తూ టీడీపీ ఎంపీ రాంమోహన్‌ తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టారు. దీనిపై స్పందించిన టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి రాంమోహన్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారనడం సరికాదన్నారు.  తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు.  వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితాలు మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని భారీ మెజార్టీతో ప్రజలు ఆమోదించారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందని అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదని, ప్రజలు అత్యధిక మెజార్టీతో తెరాసను గెలిపించారని పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఆంధప్రదేశ్‌ను విభజించేటప్పుడు తమ అభిప్రాయం వినలేదని శ్రీకాకుళం ఎంపీ

రామ్మోహన్‌నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము చాలా నష్టపోయామని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని, రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు కేంద్రం పెద్దన్నయ్యలా జోక్యం చేసుకుంటుందన్నారు. రెండుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తాను వచ్చానని విభజన వల్ల తాము సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. అయితే సమస్యలు వినకుండా, సభ్యుల అభిప్రాయం తెలుసుకోకుండా విభజన చేశారని అన్నారు. సమాఖ్య వ్యవస్థను సమర్థంగా ముందుకు నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ను విభజించాలని తాము కోరలేదని… గత ప్రభుత్వం విభజించిందని అన్నారు.  గతంలో ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాడ్డాయి.. ఆ మూడు రాష్టాల్ల్రో రాని సమస్యలు ఏపీలో వస్తున్నాయని తెలింపారు. ఇందుకు యూపీఏ అనాలోచిత నిర్ణయాలే కారణమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. ఇరు రాష్టాల్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒంటెత్తు పోకడలు పోతే ఇలాంటి సమస్యలే వస్తాయని తెలిపారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఆ నిర్ణయాలు ప్రజల ఆకాంక్షకు లోబడి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పక ఓటు వేసేలా రాజ్యాంగ సవరణ అవసరమని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.