రాజ్యాంగాని మార్చడం కాదు.. కెసిఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి
|
కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అంబేత్కర్ విగ్రహానికి పాలాభిషేకం
మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి6 (జనంసాక్షి)
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మతిభ్రమించి రాజ్యాం గాన్ని మార్చాలంటున్నారని, దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే కెసి ఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని గార్ల మండల కాంగ్రెస్ అద్యక్షుడు దనియాకుల రామారావు, ఆరోపించారు. అది వారం పిసిసి పిలుపుతో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గార్ల పట్టణంలోని స్థానిక అంబేత్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్ని కాదు, రాష్ట్రంలో అహంకార కెసిఆర్ ప్రభుత్వాన్ని మార్చాలన్నారు. ముఖ్యమంత్రి పదవి కెసిఆర్ కు రాజ్యాంగం పెట్టిన భిక్షే నని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని కెసిఆర్ కోరడం ఆయన నిజ స్వరూపానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ముఖ్య మంత్రి హోదాలో ఉన్న కెసిఆర్ సోయి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్నారని, రాజ్యాంగాన్ని మార్చాల నడం కెసిఆర్ అహంకారానికి, మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. దళితుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కెసిఆర్ మార్చాలనడం ఆయన దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనం లాంటిదన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముల్కనూరు ఎంపీటీసీ మలోత్ వెంకట్ లాల్, గార్ల ఎంపీటీసీ పసుపులేటి సుజాత.గోపాలపురం ఎంపీసీ దనియాకుల రాజకుమారి, అనుముల గంగా, పసుపులేటి రామారావు, పెద్దకిష్టాపురం ఉప సర్పంచ్ నాసర్ల వీరభద్రం, గుగులోత్ వశ్యా, భూక్యా విఠల్, బొడ్డు నరసింహ రావు, ఎల్లంకి సాయికుమార్, గద్దపాటి నరదింహారావు, అచ్చిరామ్ నాయక్, మలోత్ అనిల్, బాధవత్ పవన్, చింతల కొటేష్ తదితరులు పాల్గొన్నారు.