రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమాలు*

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి

మునగాల, నవంబర్ 19(జనంసాక్షి): మనువాదుల పాలనలో ధ్వంసమవుతున్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, ఉద్యమాలు ఉధృతం చేయడం కోసం బీహార్ రాష్ట్రంలోని బెగురుసయి పట్టణంలో డిసెంబర్ 3,4,5 తేదీలలో జరుగు కెవిపిఎస్ అనుబంధ జాతీయ సంఘం దళిత్ సోషణ్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం) ఆల్ ఇండియా మహాసభల్లో చర్చించనున్నట్లు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి తెలిపారు. శనివారం మునగాల మండల కేంద్రంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో డిఎస్ఎంఎం ఆల్ ఇండియా మూడో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలో దళితులకు కల్పించిన హక్కులు,చట్టాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ దళితులకు రిజర్వేషన్లు లేకుండా కుట్ర చేస్తున్నదని అన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలు మైనార్టీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. దళితులకు కల్పించిన హక్కులు చట్టాలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణ సామాజిక న్యాయమే ధ్యేయంగా బీహార్ లో జరిగే డి.ఎస్.ఎం.ఎం ఆల్ ఇండియా మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, మండల నాయకులు జిల్లా నవీన్, ఇంటూరి హుస్సేన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు