*రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే*

*రైతులు ఎవరు పంట రుణాలు చెల్లించొద్దు*
*అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో ₹2లక్షల రూపాయల రుణమాఫీ*
*కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు*
రేగొండ : దేశంలో, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని భూపాలపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మండలంలోని రూపి రెడ్డిపల్లి, చెన్న పుర్,  చిన్న కోడెపాక, దామరంచ పల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పక్కల నరసయ్య అధ్యక్షతన రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడారు. రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీ నేనని రైతులు ఎవరు రుణాలు చెల్లించొద్దు అని, ప్రభుత్వమే రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఇస్తుందని అన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు 15 వేల రూపాయలు అందిస్తామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి చివరి వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని రైతుకూలీలు లకు ప్రతి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యజమాన్యం హక్కు కల్పిస్తామని, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని అన్నారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని దండగ కాకుండా పండుగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ది అని అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఉపాధి హామీ చట్టం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆదరించాలన్నారు.
*కాంగ్రెస్ పార్టీలోకి చెన్నాపూర్ టిఆర్ఎస్ కార్యకర్తల చేరిక*
చెన్నాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు తౌటు వెంకటేష్, ఓన్నాల రాజు, పల్లెబోయిన ప్రేమ్ కుమార్ మరియు కౌడగాని చంద్రశేఖర్ రావులతో  పాటు మరో 50 మంది యువకులను గండ్ర సత్యనారాయణరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ రచ్చబండ కార్యక్రమంలో నాయకులు గుంటోజు కిష్టయ్య, మండల ఉపాధ్యక్షులు కౌడగాని తిరుపతి, మండల నాయకులు మేకల భిక్షపతి, దుంపెటి రాజు, గండి తిరుపతి, రొంటాల సదయ్య, ముడుతనపెల్లి శంకరయ్య, పల్నాటి శ్రీను, గుర్రాల రవి, నాగపురి మొగిలి, ముడుతనపల్లి శ్రీను, మంచిపెల్లి రవి, గటిక సదయ్య, వొన్నాల శ్రీనివాస్, పల్లెబోయిన అర్జున్, కౌడగని తిరుపతి, పల్లే దేవేందర్, మెట్టే కిరణ్, బొట్ల ప్రభాకర్, జూపాక మల్లయ్య తదితరులు ఉన్నారు.