* రామచంద్రనాయక్ ముఖ్యఅతిథిగా బయ్యారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రచ్చబండ*

బయ్యారం,మే24(జనంసాక్షి):
ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండల కేంద్రంగా  బయ్యారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బయ్యారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు డా.రామచంద్రునాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాబోయే 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో  రుణమాఫీ చేయబడుతుందని,ఇందిరమ్మ రైతు భరోసా పధకం,భూమివున్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి 15 వేల రూపాయలు, భూమి లేని ఉపాధిహామీ కూలీలకు 12 వేల రూపాయలు,అన్ని పంటలకు గిట్టుబాటు ధర, ధరణి పోర్టల్ రద్దు,పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ను రైతులకు అనుసంధానం చేయడం,నకిలి విత్తనాలు, పురుగు మందుల విక్రయధారులపై  ఉక్కుపాదం మోపుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య, రామచంద్రాపురం ఎంపీటీసీ  లక్ష్మీ(గణేష్)సొసైటీ డైరెక్టర్ బండారి మల్లయ్య,కేతమల్లు గారు,మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్,కొవ్వూరి దామోదర్ రెడ్డి,కొయ్యగురి రామకృష్ణ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు కోడి వీరన్న,కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు టి లింగయ్య, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు అజ్మీరా రమేశ్,బాలాజీపేట గ్రామ శాఖ నాయకులు బండి యాదగిరి,ఆకునూరి సూర్యనారాయణ,రామగిరి వెంకటేశ్వర్లు,యూత్ నాయకులు ఐలయ్య,మాలోత్ పృద్వి,భీమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.