రామచంద్రాపురంలో దోపిడీ దొంగల బీభత్సం

మెదక్‌ : రాయచంద్రాపురంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 4.30 లక్షల నగదును దోచుకెళ్లారు. మద్యం దుకాణం నుంచి డబ్బులను ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటువేసుకుంది. దొంగల దాడిలో గాయబడ్డ ముగ్గురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.