రాముడిపై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పను

పార్టీ, గడ్కరీతో నా సంబంధాలకు ఇబ్బంది లేదు
రాం జెఠ్మలానీ
న్యూఢిల్లీ, నవంబర్‌ 9 (జనంసాక్షి): రాముడిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తనక ఎలాంటి విచారం లేదని ఈ విషయంలో తానెవరికీ ఎలాంటి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని సీనియర్‌ న్యాయవాది , బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాం జెఠ్మలానీ అన్నారు. శుక్రవారం నాడు ఆయన ఒక ఆంగ్ల ఛానెల్‌ కార్యక్రమంలో మాట్లాడారు. తన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెట్టవా అని ప్రశ్నించగా.. పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్ధేశం తనకు లేదని, పార్టీ బలపడాలనే కోరుకుంటున్నానని చెప్పారు. రాముడిపై తన వ్యాఖ్యలకు ఎవరికి ఏ విధమైన క్షమాపణ చెప్పబోనని జెఠ్మలానీ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో మీడియా హాస్యప్రియత్వాన్ని కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తనకు రామాయణంపై పలు తీవ్రమైన సందేహాలు ఉన్నాయని అన్నారు. రాముడు
చారిత్రక పురుషుడవునా? కాదా? అని తనకు సందేహమన్నారు. స్త్రీ,పురుష సంబంధాలపై గురువారంనాడు విడుదలయిన పుస్తకావిష్కరణ సభలో ఆయన ప్రసంగిస్తూ రాముడు చెడ్డ భర్త… తన భార్య సీతను ప్రజల మాట విని అడవులకు పంపాడు. సీత ముఖమే ఎరుగను అన్న లక్ష్మణుడు అన్నా కూడా తనకు మహామంట అన్న రీతిలో వ్యాఖ్యానించారు. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి.
కాగా, గడ్కరీ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ బహిరంగ లేఖ రాసిన వ్యవహారం వల్ల పార్టీతో తన సంబంధాలలో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అలాగే గడ్కరీతో కూడా తన సంబంధాలకు ఢోకా లేదన్నారు. జెఠ్మాలనీ డిమాండ్‌పై ప్రశ్నించగా అది పార్టీకి, గడ్కరీకి మధ్య సంబంధించిన వ్యవహారం. ఆయనతో నా సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ వ్యవహారంలో తాను చేయగలిగిందేమీ లేదన్నారు. పార్టీతో తన సంబంధాలు బాగానే ఉంటాయన్నారు. అయితే కొంతమంది నేతలు తాను పార్టీ వీడి బయటకు పోవచ్చని అనుకుంటున్నారని అద్వానీ చెప్పారు.