రాయపట్నం వద్ద ఇద్దరు గొలుసు దొంగల అరెస్ట్‌

కరీంనగర్‌: ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గొలుసు ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 18.5 తులాల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 17లక్షల విలువ చేసే నగలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.