రాయలసీమ హక్కులపై శ్రీశైలం నుంచే పోరాటం: కాల్వ
కర్నూలు,ఆగస్టు7(జనంసాక్షి): రాయలసీమ హక్కులను కాపాడుకునేందు శ్రీశైలం నుంచి పోరాటం ప్రారంభించామని టిడిపి నేత మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. శ్రీశైలం డ్యాంను రాయలసీమ టీడీపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విూడియాతో మాట్లాడుతూ రాయలసీమ పేదరికాన్ని వెనుకబాటు తనాన్ని వైఎస్ కుటుంబం ఓట్లుగానే చూసిందే తప్ప సమస్యల పరిస్కారానికి ప్రయత్నం చేసింది లేదని దుయ్యబట్టారు. కృష్ణాజలాలపై రాయలసీమ వాసులకు మొట్టముదటి సారిగా నీటి హక్కును మాజీ సీఎం నందమూరి తారకరామారావు కల్పించారని గుర్తుచేశారు. శ్రీశైలం జలాశయంలోని నీటి వాటలను రెండు రాష్టాల్రకు చెరి సగం కావాలని కేసీఆర్ అడుగుతుంటే ఆయనను అడిగే దమ్ము సీఎం జగన్ లేదని ఎద్దేవాచేశారు. రాయలసీమ లిప్ట్ పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప జగన్ రెండేళ్ల పాలనలో రాయలసీమకు చేసిందేమిలేదు అంతా శూన్యమని తప్పుబట్టారు.