రాయికోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై ఫైర్: ఆందోల్ అసెంబ్లీ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు మోహన్

రాయికోడ్ మండలం జంబ్గి (కె) గ్రామ సర్పంచ్ పార్వతి వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందారు. ప్రసూతి కొరకు  మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేరిన గర్భిణిని పార్వతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు తన ప్రాణాలు తీశారని బీఎస్పీ పార్టీ  నాయకులు వైద్యుల పై మండి పడ్డారు. ఆసుపత్రిలో ప్రసూతి అనంతరం మహిళ పరిస్థితి తీవ్రంగా విషమించడంతో జహీరాబాద్  ప్రభుత్వ ఆసుపత్రి కి 108 అంబులెన్స్ లో తరలించిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వాహనాన్ని మార్గమధ్యలో ఆపి సమయానికి జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చకుండానే మధ్యలో దిగిపోవడం గమనార్హం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలస్యంగా ఆసుపత్రికి చేరడంతో పరిస్థితి విషమించి పార్వతి మృతి చెందిందాని అన్నారు. వైద్యాధికారి ఆరోజు విధుల్లో లేకున్నా రిజిస్టర్ లో సంతకం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళ గర్భిణీ మృతికి కారణమైన ఆసుపత్రి వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ బీఎస్పీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.గ్రామ అభివృద్ది కోసం కృషి చేసిన మహిళ ప్రజాప్రతినిది పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే సాధారణ ప్రజల పట్ల ఇంకే విధంగా ప్రవర్తస్తారని వైద్యుల పై మండిపడ్డారు. ఆయన వెంట బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బాబు, అనిల్ కుమార్, అనిల్ కుమార్, ప్రవీణ్ కుమార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు..