రాష్ట్రంలో అనిశ్చితికి అవినీతే కారణం: నారాయణ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అనిశ్చితికి తెలంగాణ, అవినీతి సమస్యలే ప్రధాన కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలంగాణ సమస్యలపై  అన్ని పార్టీల్లాగా తమ పార్టీ పరిగెత్తదని, ప్రజా సమస్యలతో పాటు తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి వాయలర్‌ రవి ద్వంద్వ పాత్ర పోషిస్తున్నారని రాజకీయ మర్యాద తెలియకుండా మాట్లాడుతున్నారని నారాయణ మండిపడ్డారు. తెలంగాణలో వైకాపా బలం పుంజుకుంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ సూర్యపేట సభలో మొదటిసారి జగన్‌పై విమర్శలు గుప్పించారన్నారు.