రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువు.

జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్.
తాండూరు జూన్ 6(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్రం లో ఆడపిల్లలకు రక్షణ కరువు అయిందని జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ పేర్కొన్నారు.బీజేవైఎం ఆధ్వర్యంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాదులో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం నీ నిరసిస్తూ  రాస్తారోకో పిలిపిస్తే పోలీసులు బిజెపి నాయకులను ఇండ్లను ముట్టడించి తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేయడం జరిగిందని తాండూరు నియోజకవర్గంలోని జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ విమర్శించారు. ముఖ్యనాయకులందరినీ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది.జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ను తెల్లవారుజామున గృహనిర్బంధం చేసి అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది .వారితోపాటు తాండూరు  పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, పూజారి పాండు,దొమకృష్ణ కొత్తూరు శేఖర్ , యువ మోర్చా నాయకులు కిరణ్ ముదిరాజ్,విక్రమ్ రెడ్డి  ,రమేష్ సాగర్,  శ్రీకాంత్రెడ్డి, గోవింద్ ,  తాండ్ర నరేష్,మారుతి లను ముందస్తు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా రమేష్ కుమార్  మాట్లాడుతూ పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లా  మారుతున్నారని హైదరాబాద్ నడిబొడ్డులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితులను పూర్తిస్థాయిలో పట్టుకోకపోగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష బిజెపి నాయకులను అక్రమ  అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు,నిందితులు పోలీసు బాస్కు బంధువులని, ఎంఐఎం నాయకులు పిల్లల్ని ఆధారాలతో సహా మా నాయకుడు రఘునందనరావు మీడియా ముందు ఉంచితే ఇప్పటికీ నిద్రపోతున్న పోలీస్ వ్యవస్థను ఏమని అనాలని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా ఏ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకపోగా అనేక దుర్మార్గాలకు దౌర్జన్యాలకు దోపిడీలకు పాల్పడుతున్న టీఆర్ఎస్  పార్టీ నాయకుల ఆగడాలకు  అడ్డూ లేకుండా పోయిందని మండిపడ్డారు .రాష్ట్ర  ముఖ్యమంత్రి  తక్షణమే హోం మంత్రిని బర్తరఫ్ చేసి ఎంఐఎం నాయకులను అరెస్టు చేసి ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.