రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటివరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ, హన్మకొండ, రామగుండంలలో 42, ఆదిలాబాద్‌, కావలి, నెల్లూరు, ఒంగోలు, రెంటచింతల, నల్గొండ ,తిరుపతి, నిజామాబాద్‌లలో 41 డిగ్రీలు, బాపట్ల, నందిగామ, హైదరాబాద్‌, మెదక్‌లలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.