రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
బిజెపి జాతీయకార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి
జుక్కల్, జూలై27,జనంసాక్షి,
తెలంగాణా రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన బుధవారం ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ మండలంలోని పెద్ద కొడప్ గల్, తుప్ దళ్, చిన్న తక్కడ పల్లి, బేగంపూర్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తానని అప్పుల తెలంగాణ గా మార్చారని విమర్శించారు.దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ,నిరుద్యోగభృతి ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఎవరికి ఇస్తున్నారని ప్రశ్నించారు.అర్హులైన వృద్దులకు వితంతువులకు, ఒంటరిమహిళకు ,వికలాంగులకు పింఛన్లు ఇవ్వడంలేదని విమర్శించారు. ఇంటింటికి తాగు నీరు ఎక్కడ అందుతుందని ప్రశ్నించారు. గ్రామాల్లో టిఆర్ఎస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగినబుద్దిచెబుతారని ఆయన అన్నారు. ప్రజాగోసలో భాగంగా తిరుగు తున్న తనకుప్రజలు టిఆర్ఎస్ ఆగడాలు,ప్రజల బాధలు తెలుపు తున్నారని అన్నారు. ప్రజాగోస కార్యాక్రమంలో బిజెపి కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామగ్రామన బిజెపి పతాకాన్ని ఆవిష్కరించారు.ప్రజలందరికి కలిసి సమస్యలు తెలుకున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు అరుణ తార,జిల్లా నాయకులు రాము, చిలువేరి అశోకరాజ్ పెద్దకొడపగల్ మండల బీజేపీ అధ్యక్షులు పెండ్యాల హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు