రాష్ట్రంలో బిజెపికి ఎనిమిది స్థానాలు రావడం గర్వకారణం.
తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు కైవసం చేసుకోవడం గర్వకారణమని జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ పేర్కొన్నారు.సోమవారం తాండూరు పట్టణం భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో బిజెపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలకు డబ్బును ఆశ చూపించి నీచ రాజకీయ పాలన కొనసాగించారని విమర్శించారు.రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ లో బిజెపి గాలి సాగింద న్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 8స్థానాల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై వెంకటరమణ గెలుపొందడం బిజెపి పార్టీ బలంగా ఉందని చెప్పుకొచ్చారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎంపీ సర్పంచుల స్థానాలకు పోటీ చేసి బిజెపి సత్తాను సగరువంగా చాటుకుంటామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరుగ్యారెంటీ పథకాలు అమలు కాని పక్షంలో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.తాండూర్ నియోజకవర్గంలో జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా శంకర్ గౌడ్ అధిష్టానం తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోదించారని అయిన ప్పటికీని తాండూర్ బిజెపి నాయకులు బూతు స్థాయిలో నుండి కష్టపడి జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ కు మద్దతు తెలిపామని పేర్కొన్నారు. ఆలస్యమైనప్పటికిని ప్రజల నుండి మంచి స్పందన లభించిందన్నారు.తాండూరు నియోజ కవర్గంలో బిజెపి అభ్యర్థిగా బరిలో ఉంటే భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీ వచ్చేదని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం కౌన్సిలర్ లు అంతారం లలిత, మండల అధ్యక్షులు ఆంజనేయులు, సందీప్ కుమార్ లు కలిసి మాట్లాడుతూ జనసేనా బిజెపి ఉమ్మడి అభ్యర్థి గా శంకర్ గౌడ్ కు సహకరించినందుకు ప్రతి ఓక్కరి కృతజ్ఞతలు తెలిపారు.జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ తాండూరు ఎన్నికల బరిలోకి హలస్యంగా రావాడంతో కస్తా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.అయినప్పటికీని గట్టి పోటీ ఇచ్చామని తెలిపారు.ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారెంటీ పథకాలు అమలు చేయాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతుందని హెచ్చరించారు.తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపికి అవకాశం లభించి ఉంటే కనుక గెలుపు మాదే ఉంటుందన్నారు .జనసేనా అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ ఆలస్యంగా వచ్చిన ప్పటికిని బుత్ స్థాయిలో కష్టపడ్డామన్నారు.రాబోయే రోజుల్లో బారతీయ జనతాపార్టీ ఆద్వర్యంలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మండలాల అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు