రాష్ట్రంలో 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు

విశాఖపట్నం : రాగల 24 గంటల్లో రాాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వాయుగుండం స్థిరంగా కోనసాగుతుంది. ఇదిక్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.దీనికి తోడు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాయుగుండం, రుతుపవనాల ప్రభావం వల్ల రాఫ్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం నమోదయ్యేఅవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో గన్నవరం 13, తుని 9, కాకినాడ, ఒంగోలు, బాపట్ల 8, నర్సాపూర్‌ , 6, హైదరాబాద్‌ , కళింగపట్నం, మచిలీపట్నం, విశఖపట్నం 4, కర్నూలులో 3, సెంటిమీటర్ల చోప్పున వర్షాపాతం నమోదైంది.