*రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో తండాలో గిరిజనులు సంబరాలు.

చిట్యాల22(జనంసాక్షి)దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో  ఆదివాసి మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో శుక్రవారం మండలంలోని లక్ష్మీపురం తండాలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా బిజెపి జిల్లా మీడియా సెల్ ఇంచార్జి పోశాల రాజు మాట్లాడుతూ దేశంలో ఒక ఆదివాసి మహిళకు సముచిత స్థానం కల్పిస్తూ రాష్ట్రపతిగా ఎన్నుకున్న ఎన్డీఏ కూటమికి బిజెపి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే బిజెపి దేశంలో అట్టడుగున ఉన్న ప్రజలకు సముచిత స్థానం కల్పించడంలో వారికి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ  కృషి చేస్తున్నారని దేశంలో చిట్టచివరి ప్రజలకు సంక్షేమ ఫలాలు రాజ్యాధికారాలు అందించడంలో బిజెపి నాయకత్వం పనిచేస్తుందని ఉన్నారు.ఆదివాసీలు గిరిజనులు అంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయని కనీసం వారికి గౌరవం కల్పించడంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విఫలమవుతున్నాయని రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసి మహిళ ద్రౌపది మురముగారికి ఓడించాలనే దృక్పథంతో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కాంగ్రెస్  పార్టీలు ద్రౌపది ముర్ము గారికి వ్యతిరేకంగా ఓటు వేశారని రానున్న రోజుల్లో ఆదివాసీలు గిరిజనులు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అదేవిధంగా ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఎన్నికవ్వడంతో దేశవ్యాప్తంగా గిరిజనులు ఆదివాసులు ఆనందం వ్యక్తం చేసారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల బిజెపి అధికార ప్రతినిధి రావుల రాకేష్ కోల శివ,రాకేష్ శ్రీనివాస్ స్వరూప,లక్ష్మి, శ్రీలత ,కౌసల్య, సులోచన,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు