రాష్ట్రపతి అవార్డులకు ఎంపికైన ముగ్గురు రాష్ట్ర పోలీసులు
న్యూడిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పోలీసు విశిష్ట సేవా అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు పోలీసులు ఎంపికయ్యారు. ఎస్.ఏ.హుడా(అడిషనల్ ఐజీ), సత్యనారాయణ(అవినీతి నిరోదక డైరెక్టర్), ఎన్.ఏ.సురేంద్రబాబు(ఆక్టోపస్ ఐజీ)లు ఉన్నారు. వీరు ప్రజలకు అందించిన విశిష్ట సేవలకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.