రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌కు ఓటువేసే అవకాశం.?
హైదరాబాద్: వైఎస్‌ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటూ చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతివ్వలని ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు. ఈ నెల 19వతేదిన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. కేసులో నిందితుడిగా ఉన్న శాసన సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సంఘం అనుమతి పోందాల్సి ఉంటుంది. శాసనసభ ఆవరణలో ఓటు హక్కు వినిమోగించుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్, సంగ్మాలకు ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, పార్టీ నాయకులు జగన్‌కే వదిలేశారు. జగన్ ప్రతి పాదించిన వ్యక్తికి ఓటేయడానికి సిద్దంగా ఉన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను సంగ్మా కలుసుకున్నారు. ఎవరికి వీరు ఓటు వేస్తారనేది చర్చనీయంశం అయింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్థుతం 17శాసన సభ్యులు ఇద్దరు ఎంపీలు ఉన్నారు వీరంత జగన్ ఆదేశాల మేరకు ఓటింగ్‌లో పాల్గొననున్నారు.