రాష్ట్రపతి ప్రణబ్‌తో సోనియా భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశంలో కేంద్ర కేబినేట్ పునర్‌వ్యవస్థీకరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20న మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఉదయం గంటసేపు రాష్ట్రపతితో ప్రధాని భేటీ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణపైనే చర్చించినట్లు తెలుస్తోంది.