రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది పర్యటన ఖరారు
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. డిసెంబర్ 18 నుంచి 31 వరకు ప్రణబ్ హైదరాబాద్‌లో ఉండనున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించే మహాచండీయాగానికి ప్రణబ్ హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.