-రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పతకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. -ప్రభుత్వ విప్,అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్ 2(జనం సాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పతకాలు సత్ఫలితాలు ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు అన్నారు.గురువారం తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరంలో అడిగిడుతున్న వేళ నాగర్ కర్నూల్ జిల్లా పోలిస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.పోలిస్ పరెడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్,జిల్లా ఎస్పి కే. మనోహర్, జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి తో కలిస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ జాతీయ పతాకావిష్కరణ చేసి పోలిస్ గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పతకాలు దేశానికి ఆదర్శంగా నిలువడమే కాకుండా నేడు తెలంగాణా రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని పేర్కొన్నారు.రాష్ట్ర సర్వతోముఖాభివ్రుద్ధికి అన్ని కులాలు,అన్ని వర్గాల ప్రజల ఆర్ధిక సాధికారత కై పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగానే దళితుల ఆర్థికాభివృద్ధి స్వావలంబనకై దళిత బంధు పతాకాన్ని ప్రవేశ పట్టడం జరిగిందన్నారు.జిల్లాలో చారగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రతి నియోజకవర్గంలో వంద మంది చొప్పున 301 దళిత కుటుంబాలను ఎంపిక చేసి ఇప్పటి వరకు మొత్తం 1674 మంది లబ్దిదారులకు రూ. 37.68 కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగిందన్నారు.దళితులకు పాడి గేదెల పెంపకం ద్వారా అభివృద్ధి పొందేందుకు అచ్చంపేట నియోజకవర్గంలో 3.50 కోట్ల నిధులతో 175 మంది లబ్దిదారులకు ఆర్ధిక సహాయం చేసేందుకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిమిషాల్లో పూర్తి అయి ఇ-పట్టాదార్ పాస్ పుస్తకం అందించడం జరుగుతుందన్నారు. రైతుబందు ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2.77 లక్షల మంది రైతులకు రూ.2512 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.3,389 మంది రైతులు వివిధ కారణాల వాళ్ళ చనిపోతే రైతు భీమ ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 169.45 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. జిల్లాలో యాదవ గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీతో 9,127 గొర్రెల యూనిట్లను ఇవ్వడం జరిగిందన్నారు. అచ్చంపేట, ఉప్పునుంతల మండలాలో 15 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు 15 కిలో మీటర్ల బ్రాంచ్ కెనాల్ కొరకు107.20 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ పరిపాలన అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. అచ్చంపేట, బల్మూర్ మండలాల్లోని 70 వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి 5 టి.యం.సి ల సామర్థ్యం తో ఉమామహేశ్వరం, చెన్నకేశవ రిజర్వాయర్ నిర్మాణానికి సర్వ్ పనులు చేయడానికి పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణాకు హరితహారం కింద జిల్లాలో ఇప్పటి వరకు 6.21 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని, 8 వ విడత హరిత హారంలో ఈసారి జిల్లాలో 68 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.విద్యా వైద్యాన్ని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి జిల్లాకు 178 పల్లె దవఖానాలు మంజూరు అయ్యాయన్నారు. జిల్లాకు మేడికల కళాశాల మంజూరు కావడం, ప్రభుత్వ ఆసుపత్రి 330 పడకలకు అప్గ్రేడ్ చేయడం వల్ల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో వస్తుందన్నారు. మన ఊరు మన బడి మన బస్తి మన బడి కార్యక్రమం కింద విద్యా రంగాన్ని బలోపెతెం చేసేందుకు జిల్లాలోని 825 శాలలను విడతల వారిగా అన్ని సదుపాయాలతో కార్పోరేట్ పాటశాలలకు దీటుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో290 పాతశాలలను ఎంపిక చేసి 138 పాతశాలలకు అనుమతి మంజూరి చేయడం జరిగిందన్నారు. 40 పాటశాలలు పని పూర్తి అయ్యిందన్నారు.పేద విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లు అందించడం జరుగుతుందని, వసతి గృహాలు సైతం నడుపబడుచున్నట్లు తెలిపారు. షెడ్యుల్డ్ తరగతి వారికి గిరివికాసం కింద వంద శాతం సబ్సిడీ తో జిల్లాలో బోర్లు వేయించి మోటార్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కళ్యాణ లక్ష్మి, శాది ముబారక్ వంటి పథకాల వాళ్ళ పేద అమ్మాయిల పెళ్ళికి ఆర్ధిక సహాయం, కే.సి.ఆర్ కిట్ల అందజేత వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయన్నారు. విద్యార్థులకు క్రీడలలో ఆసక్తి, నైపుణ్యం పెంపొందిన్చేదుకు ఈ రోజు ప్రతి మండలంలో కనీసం 2 క్రీడా మైదానాలను ప్రారంభించుకోవడం ఏంతో గర్వకారణంగా ఉందని తెలియజేసారు. అననతరం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం లో విశిష్ట సేవలు చేసిన మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, సర్పంచులు, పంచాయతి సెక్రెటరిలు, రెడ్ క్రాస్ సోసాయిటి సభ్యులకు ప్రశంస పత్రలతో సత్కరించారు.ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ, సఖి, వ్యవసాయ, ఉద్యాన వనం శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి అభినందించారు. రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి ప్రశంస పత్రాలను అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ కుమార్, స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, జిల్లా ఎస్పి కే. మనోహర్, అదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రెవిన్యూ మోతిలాల్ నాయక్, అడిషనల్ ఎస్పి రామేశ్వర్ రావ్, మున్సిపల్ చైర్మన్ కల్పనా, జడ్పి టిసిలు, ఎంపిపి లు, ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు, పోలిస్ అధికారులు, పాత్రికేయులు ప్రజలు పాల్గొన్నారు.