రాష్ట్రప్రభుత్వం వైఫల్యం చెందింది

గుంటూరు, జూన్‌ 28 : రాష్ట్రప్రభుత్వం వైఫల్యం వలన రాష్ట్రంలో ప్రారంభం కావాల్సిన యెడల పాఠశాలల నిర్మాణం జరగటం లేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గురువారం పేర్కొన్నారు. మండలంలోనివీరెడ్డిపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలు మొదలై రెండు వారాలు కావస్తున్నా 50 శాతం పుస్తకాలు కూడా అందలేదన్నారు.3,6,7,10 తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్‌ పాఠ్యపుస్తకాలు చేరలేదన్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌ సెక్రటరీ చందనాఖాన్‌ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీనిపై స్పందిస్తూ జులై మొదటి వారంలో పుస్తకాలను అందజేస్తామని తెలిపామన్నారు. ఆర్‌వీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో 52 లక్షల ఉచిత యూనిఫాం ఇవ్వాల్సి ఉందన్నారు. దీనికి గాను రూ.210 కోట్లు కేటాయించినా క్లాత్‌ అందలేదన్నారు. ఆర్‌విఎం కింద ఉన్నత పాఠశాలలో 6,7,8 తరగతులకు 12వేల పోస్టులు మంజూరు కాబోతున్నాయని హిందీ తెలుగు బోధించడం కోసం ఐదువేల పోస్టులు ఆప్‌గ్రేడ్‌ కాబోతున్నాయన్నారు.