రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం: నాని
విజయవాడ,మే29(జనం సాక్షి): రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఎపినే కాకుండా రాష్ట్రాలనే తన గుప్పిట్లో ఉంచుకోవానల్న దుర్మారగ్పు ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఫెడరల్ వ్యవస్థలో దుర్మార్గమని అన్నారు. మంగళవారం ఆయన మహానాడులో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను బూచీగా చూపించి రాష్ట్రాలకు వచ్చే నిధులను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తే ఏపీకి 7వేల కోట్లు నష్టం జరుగుతుందన్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నాని అభిప్రాయపడ్డారు. బాబు తలచుకుంటే మోడీ ఎక్కడని అన్నారు. ప్రాంతీయ పార్టీలు కలిస్తే బిజెపికి పుట్టగతులు ఉండవన్నారు.