రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మునుగోడు లో పర్యటన
జనం సాక్షి బ్యూరో,నల్గొండ,
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఏర్పాటను పరిశీలించారు, నియోజకవర్గ పరిధిలోని చండూరు గ్రామంలో గల డాన్ బాస్కో జూనియర్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం మిషన్ లను పరిశీలించారు. బ్యాలెట్ పేపర్ల పంపిణీ విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల నిర్వహణలో ఇలాంటి ఇబ్బంది ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికరణం ఆదేశించారు. అనంతరం చండూరు మండలంలోని కోటే గూడెం గ్రామం లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామాలలో పోల్ చిట్టిలను అందించడంలో బి ఎల్ ఓ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామాలలో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారా అనే విషయాన్ని గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఓట్లు వేసేందుకు డబ్బులు ఇచ్చిన వారిని తీసుకుని వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలు గ్రామాల్లో ప్రజలను కలిసి ఓటు హక్కు జారీ చేసే విషయంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చండూరులోని ఎంపీడీవో సమావేశం మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమాలని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. అదేవిధంగా పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ పార్టీలపై వచ్చే ప్రతికూల వార్తల పట్ల విచారణ చేపట్టాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ అయిన తర్వాత తిరిగి రిసెప్షన్ సెంటర్ కు చేరేంతవరకు పట్టిష్టమైన ఏర్పట్లను చేపట్టాలన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల నిర్మాణ విషయంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్నికల కంట్రోల్ రూమ్ కు పోలింగ్ సంబంధించిన అన్ని విషయాలు అప్పటికప్పుడు చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి. సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్. జిల్లా ఎస్పీ రేమో రాజేశ్వరి. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు. యాదాద్రి జిల్లా డిసిపి నారాయణరెడ్డి లు పాల్గొన్నారు