రాష్ట్ర బిజెపి పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

మునుగోడు లో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోతాడు అన్న విషయాన్ని గ్రహించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై హత్యా ప్రయత్నం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీకి నిరసనగా రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు చౌడపూర్ మండల బిజెపి అధ్యక్షుడు బందయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి శ్రీనివాసులు,మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్,రామాంజనేయులు,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు వెంకటేష్,సీనియర్ నాయకులు జనార్ధన్,యువమోర్చా మండల అధ్యక్షుడు శరత్,శ్రీను,నరేష్,గోపాల్,చెన్నయ్య,రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

తాజావార్తలు