*రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలి.
చిట్యాల23(జనంసాక్షి)ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి భారీ నష్టం చేసిందని, బాధితులందరు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర విపత్తుగా ప్రకటించి బాధితులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి (సి) లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర, జిల్లా, మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రైతులు వేసిన పంటలు, ఇండ్లు దెబ్బతిని నిరాశ్రులయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంబంధించిన అధికారులతో పారదర్శకంగా సర్వే నిర్వహించి పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు,ఇండ్లు దెబ్బతిన్న బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తో పాటు 20 వేల రూపాయలు అందించి ఆదుకోవాలని, ఇండ్లు, పంటలు దెబ్బతిన్న బాధితులను ప్రభుత్వం ఆదుకొని , దెబ్బతిన్న వంతెనలు రహదారులు నిర్మించాలని డిమాండ్ చేశారు. .
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, రైతులు, ఇండ్ల బాధితులు కనకం రాములు, నద్దునూరి భద్రయ్య, పుల్ల నాగరాజు, పుల్ల భద్రయ్య పుల్ల సంజయ్, మాసు పవన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area