రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు పట్టా పథకం అమలు
చేగుంట: రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు పట్టా పథకాన్ని అమలు చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్ కుమార్ తెలిపారు. మండలంలోని వడ్యారం గ్రామంలో పధకంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ పథకాన్ని దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు.ఇది ప్రయోజనకారిగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్యంరెడ్డి,ప్రత్యేక కమిషనర్ విద్యాసాగర్,జేసీ శవత్ పాల్గోన్నారు.