రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
ఖమ్మం క్రీడలు: రాష్ట్ర స్థాయి ఆహ్వానిత క్రికెట్ పోటీలు శనివారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏవీ రంఘనాధ్ ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని ప్రారంభించారు. సీఐ నరేష్‌రెడ్డి పర్యవేక్షణలో పోటీలు కొనసాగుతున్నాయి. 12 జిల్లాలకు చెందిన పేరొందిన క్రికెట్ జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి.