రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లోనూ రాణించాలి:- జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మిర్యాలగూడ. జనం సాక్షి

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లోనూ నల్గొండ జిల్లా విద్యార్థులు పాల్గొని విజేతగా నిలిచేందుకు ప్రయత్నించాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కోరారు. గురువారం మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రధమ ద్వితీయ తృతీయ చతుర్థి బహుమతులు పొందిన విజేతలకు ఫీల్డ్ నగదును అందజేశారు. ప్రతిభగల క్రీడాకారులు గ్రామీణ స్థాయిలోనూ ఉన్నారని వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకుగాను గ్రామస్థాయిలోనూ  క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుచేసి క్రీడలలో తర్ఫీదును ఇవ్వాలన్నారు. క్రీడాకారులకు ఎల్లవేళలా ప్రోత్సహిస్తానని హామీనిచ్చారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువుపై దృష్టి సారించాలని కోరారు. పోటీ పరీక్షలలో నెగ్గాలంటే కష్టపడి చదవాలని, క్రీడలలో పోటీపడి గెలుపొందినట్లే  ఉద్యోగాల సాధన విషయంలో కూడా పోటీ పడి చదవాలని సూచించారు. కార్యక్రమంలో సామాజికవేత్త మున్సిపల్ కాంగ్రెస్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, కోదాడ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, జంకు తండా సర్పంచ్ రవీందర్ నాయక్ వార్డు సభ్యులు శ్రీనివాస్,మహేందర్, సిద్దు, సాయి, మౌలా, చింటూ అఖిల్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు
జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రథమ బహుమతి రూపాయలు 20,016 తోపాటు ఫీల్డ్ ను భగత్ సింగ్ యూత్ గెలుపొందగా ద్వితీయ బహుమతి రూపాయలు 12,016 లతోపాటు ఫీల్డ్ జంకుతండ గెలుపొందింది. తృతీయ బహుమతిని ప్రకాష్ నగర్ జట్టు గెలుపొంది 7016 నగదుతో పాటు ఫీల్డ్ కైవసం చేసుకోగా చతుర్ధ బహుమతిని మహేందర్ 11 టీం 5016 నగదు ఫీల్డ్ ను గెలుపొందారు.