రాష్ట్ర స్థాయి బహుమతి అందుకున్న మల్కాపూర్ విద్యార్థిని సాంబారి సిరి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 16 , ( జనం సాక్షి ) :
ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఆహార కమిషన్ ఆదర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో జన గామ జిల్లా చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన పదవ తరగతి విద్యార్థి సాంబారి సిరి రాష్ట్రస్థాయి కన్సోలేషన్ బహుమతి పొందడం జరిగింది. ఇట్టి బహుమతిని తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్, పౌర సరఫరాశాఖ కమీషనర్,మాతా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ చేతుల మీదుగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బహుమతి తీసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర స్థాయి బహుమతి పొందిన పదవ తరగతి విద్యార్థి సాంబారి సిరి ని టిఆర్ఎస్ మండల సమన్వయకర్త పోలేపల్లి రంజిత్ రెడ్డి తో పాటు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు అభినందించారు.