రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
బోనకల్ : ఇటీవల జరిగిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారని
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నళినిశ్రీ తెలిపారు.
Mpc లో 470 మార్కులకు గాను V.నిఖిల్ 466, నీలిమ 465, సుమాంజలి 464, సాయి సిధార్థ 461 ,
Bipc లో 440 మార్కులకు గాను Sk.షాహీన్ 431, శ్రీ విద్య 426, హేమలత 421, మహిత 420 , Hec లో 500 మార్కులకు B.ఝాన్సీ 446 వంటి అత్యుత్తమ మార్కులు సాధించారు.
ప్రైవేట్, కార్పొరేటు కళాశాలలకు ధీటుగా తమ కళాశాల విద్యార్ధులు ఈ మార్కులు సాధించటం పట్ల, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక ,అధ్యాపకేతర సిబ్బంది తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
కళాశాలలొ అనుభవజ్ఙు లైన అధ్యాపక బృందం వుందని , ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ లు ఇంకా జరుగుతున్న0దున పదవ తరగతి పాస్ అయిన విద్యార్ధులు కళాశాల లో అడ్మిషన్ పొందవచ్చని తెలియ చేసారు.