రాహుల్‌ బాబూ నిద్దురపోయాడు

1

న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి):: బిజెపి యూపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో కలతచెందిన మాయావతి అంత బాధలో కూడా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని దులిపేశారు. గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడుల అంశంపై ఓ పక్క పార్లమెంట్‌ అట్టుడుకుతుంటే రాహుల్‌ గాంధీ లోక్‌సభలో నిద్రపోతున్నారని మండిపడ్డారు. దీనిపై మండిపడిన మాయ రాహుల్‌ను దులిపేశారు. దళితులపై దాడుల వంటి కీలకమైన అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతుంటే రాహుల్‌ నిద్రపోవడం సరికాదన్నారు. రాహుల్‌ నిద్ర పోవడం ద్వారా దళితులపై తమకున్న నిర్లక్ష్య వైఖరిని చాటుకున్నారని మండిపడ్డారు. దళితుల బాధలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టవనే విషయం తేలిపోయిందన్నారు. మాయావతి మాట్లాడుతున్న సమయంలో రాహుల్‌ కునుకు తీస్తున్నారు. దీనిని అధికార బిజెపి తీవ్రంగా తప్పు పట్టింది. రాహుల్‌కు నిద్ర తప్ప మరో వ్యాపకం లేదని విమర్శించింది. అయితే విమర్శలను కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కునుకు తీయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సీరియస్‌ విషయంపై చర్చ జరుగుతుండగా నిద్ర పోతారా అంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తోంటే కాంగ్రెస్‌ నేతలు సమర్థించుకునే పనిలో పడ్డారు. ఆ క్రమంలో వారు పొంతనలేని సమాధానాలు చెప్పి పార్టీ పరువును మరింతగా దిగజార్చకున్నారు. బయట వేడిగా ఉంటే పార్లమెంట్‌ లోపల చల్లగా ఉంటుంది.. అందుకే బయట నుంచి వచ్చిన ఎవరైనా కొంచెం రిలాక్స్‌ అవుతారని కాంగ్రెస్‌ ఎంపి  రేణుకా చౌదరి అంటూ వివరణ ఇచ్చారు. రాహుల్‌ పార్లమెంట్‌లో కునుకుతీశారంటూ ఉదయం నుంచి ప్రసారమాధ్యమాలు ¬రెత్తిస్తుండటంపై ఆమె తీవ్రంగా  స్పందించారు. విూడియా కూడా అతిగా దీనికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మరికొంత మంది నేతలు ఆయన మొబైల్‌ఫోన్‌ చెక్‌ చేసుకుంటున్నారంటూ సర్దిచెప్పారు. గుజరాత్‌లోని దళితులపై దాడులను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తుండగా ఆయన నిద్రపోవటం పార్టీకి ఇబ్బందికరంగా మరింది. దీనికి తోడు త్వరలో ఆయన గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ ఘటనపై బీఎస్పీ నేత మాయావతి మండిపడ్డారు. రాహుల్‌ తీరు కాంగ్రెస్‌కి దళితులపై ఉన్న ప్రేమకి అద్దంపడుతోందన్నారు. దీంతో పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఆయన నిద్రపోవట్లేదు అని చెప్పేందుకు పార్టీ నేతలు ప్రయత్నించారు. పార్లమెంటులో రాహుల్‌ గాంధీ నిద్ర పోలేదని.. ఆయన తన ఫోన్‌లో ఇన్‌బాక్స్‌ చెక్‌ చేసుకుంటున్నారని పలువురు కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు. రాహుల్‌ నుదుటికి చెయ్యి ఆనించి, కొంచెం కిందకు వంగి, కళ్లు మూసుకున్నట్లు కెమెరాలో రికార్డైరది. ఈ వీడియోతో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయితే పలువురు కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఆయన నిద్రపోలేదని చెప్పారు. సెల్‌ఫోన్‌ చూసుకోవడం కూడా నేరమేనా అని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వి ఎదురు ప్రశ్నించారు. స్పీకర్‌ మాటలు సరిగ్గా వినడానికి ఇదే చక్కటి మార్గమని.. రాహుల్‌ కళ్లు మూసుకుని వింటున్నారని మరో కాంగ్రెస్‌ మద్దతుదారు, కాలమిస్ట్‌ తెహసీన్‌ పూనావాలా ట్వీట్‌ చేశారు.