రికార్డుల ప్రక్షాళనలో విఆర్‌వోలు బిజీ
కలెక్టర్ ఆదేశాలతో చురుకుగా పనులు
మెదక్,జూన్9(జనం సాక్షి ): భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రికార్డులు సరిచేసే కార్యక్రమం జిల్లాఓ జోరుగా సాగుతోంది. గ్రామాల్లో వీఆర్వోలు ఐతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలావుంటే ఈ నెల 20లోపు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశించారు. దీంతో విఆర్‌వోలు గ్రామాల్లో తప్పులు రిదిద్దే పని చేప్టటారు. ఇదిలావుంటే పెద్ద సర్వే నంబర్లలలో విస్తీర్ణం హెచ్చుతగ్గులు ఉన్న కేసుల్లో సర్వేయర్లతో సర్వే జరిపించి భూమి కాస్తులో ఉన్న రైతుల కు మాత్రమే ప్రొసీడింగులు అందజేయాలని కలెక్టర్ సూచించారు. నాన్ అగ్రికల్చర్ భూములు గుర్తించి వాటిని తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. ఊరికి దగ్గరగా ఉన్న వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా చూయించడం సరికాదన్నారు. వీఆర్వోలు ఏది రాసుకువచ్చినా సంతకాలు పెట్టే పద్ధతిని తహసీల్దార్‌లు మానుకోవాలని రికార్డుల్లో ఏమి ఉందో పరిశీలించి సంతకాలు పెట్టాలని అలా చేస్తే ఇలాంటి తప్పులు జరుగవని అన్నారు. కొందరు విఆర్‌వోలు అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ అన్నారు. వీఆర్వోలు రెవెన్యూ రికార్డులను సరిచేయడానికి అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈవిధంగా అవినీతికి పాల్పడిన వారికి సహకరించిన అధికారులను కూడా ఉపేక్షించేది లేదని తహసీల్దార్‌లను హెచ్చరించారు. చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సందర్భంగా వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరగా పరిష్కరిం చాలని ఆదేశించారు. రికార్డుల సవరణకు అధికారులు రైతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే వీఆర్వోలపై, అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం మొదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో చెక్కుల పంపిణీ జరుగకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనమన్నారు. పాస్‌పుస్తకాలు రాకుండా చెక్కులు మాత్రమే వచ్చిన రైతుల వద్ద నుంచి చెక్కులు ఇచ్చే సమయంలో ఆధార్‌కార్డు ప్రతులు సేకరించాలని ఎన్నిసార్లు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసే పనిని చిత్తశుద్ధితో చేయాలని, అన్నారు.
ర



