రిజర్వేషన్లతో ముస్లింలకు సామాజిక సమానత్వం
– ముస్లిం సబ్‌ప్లాన్‌తో ఆర్థికాభివృద్ది
– సమగ్రాభివృద్దికి రాజకీయ రిజర్వేషన్ తోడ్పాటు
– సియాసత్ రెసిడెంట్ ఎడిటర్ అమీర్‌అలీఖాన్
కరీంనగర్, అక్టోబర్ 18 (జనంసాక్షి): తెలంగాణలో ముస్లింలు దళితులకన్నా దయనీయమైన పరిస్థితుల్లో వున్నారని విద్యా, ఉపాధితో పాటు రాజకీయంగా కూడా వెంటనే 12శాతం రిజర్వేషన్ అమలు చేసి సామాజిక సమానత్వంకు బాటలు వేయాల్సిన బాధ్యత తెలంగాణ సర్కార్‌కు వుందనిసియాసత్ రెసిడెంట్ ఎడిటర్ సంపాదకులు అమీర్ అలీఖాన్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ముస్లిం వెల్ఫ్‌ర్ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ మెహినోద్దిన్(మోయిజ్) అధ్యక్షతన జరిగిన ‘విద్య-ఉపాధి వెనుకబాటు తనం’ సదస్సుకు అమీర్ అలీఖాన్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రణాళికలో ముస్లింలకు ఇచ్చిన హామి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వుందని గుర్తుచేశారు. ఎస్సీ ఎస్టీలకు ఉపప్రణాళిక వల్ల నిధులు పక్కదారి పట్టకుండా వారి అభ్యున్నతికి ఖర్చు చేస్తున్నారని అదే తరహాలో ప్రత్యేక ప్రణాళిక కూడా వుండాల్సిన అవసరం ఎంతైనా వుందని అభిప్రాయ పడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ముస్లింలు విద్య, ఉపాధి అవకాశాలు అందకుండా వెనుకకు నెట్టి వేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ సచార్ కమిటీ వేయడానికి యుపిఎ ప్రభుత్వంలో చేసిన ప్రయత్నం ఇప్పుడు ఎందుకు ఒక హామిని ఆచరణలో పెట్టడానికి తాత్సారం చేస్తున్నారని అన్నారు. వెంటనే బిసి కమీషన్ వేసి రిజర్వేషన్ ముస్లిం జనాభా ప్రకారం చేపట్టాలని కోరారు. విద్య ఉపాధితో మాత్రమే రిజర్వేషన్ సరికాదని స్థానిక సంస్థలు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సమస్యలను పరిష్కరించి సమగ్ర అభివృద్దికి బాటలు వేయాలని కోరారు. ముస్లిం ఆర్థిక వికాసంకు సబ్‌ప్లాను కూడా రూపొందించి చట్టబద్దత తీసుకొని రావాలని సూచించారు. సామాజిక ఆర్థిక సమగ్రాభివృద్ది కేవలం ఉపాధి విద్య రిజర్వేషన్‌తో మాత్రమే రాదని రాజకీయ అవకాశాలు కూడా వుంటేనే అది సాధ్యమవుతోందని చెప్పారు. రంగరాజన్ కమిటీ కూడా దేశంలో వున్న వాస్తవపరిస్థితి తెలింపిందని చెప్పారు. రిజర్వేషన్ల కల్పనలో ఇప్పటికి సరైన చొరవ తీసుకోక పోవడంతో 1247 ఉద్యోగాలు తాము కోల్పోయినామని చెప్పారు.సచార్ కమిటీని అమలు చేయాలని అదే విధంగా మీరు గతంలో చేసిన సర్వే ప్రకారం తెలంగాణలో వెనుకబడిన ముస్లింల ఉన్నతికి ప్రణాళికలు రూపొందించాలని కోరారు. గత పాలకులు వైఎస్‌ఆర్ 10శాతం రిజర్వేషన్ తీసుకొస్తే యాబైశాతం మించకుండా వుండేందుకు కేవలం 4శాతం కుదించారని గుర్తుచేశారు. తమిళనాడు, కేరళ తరహాలో రిజర్వేషన్‌పై ముస్లిం జనాభా బట్టి నిర్ణయంతీసుకోవాలని సూచించారు. ఉస్తాద్‌హాబిస్ భర్ఖతుల్లా ఖాసిమి, జమాతే ఇస్లామిక్ ప్రతినిధి ముఫ్తినమదీమోద్దిన్, తెలంగాణ ముస్లిం విద్యావంతుల వేదిక రాష్ట్రకార్యదర్శి రియాజ్‌అలీ రజ్వీ, అలీమోద్దిన్, ఖమోరోద్దిన్, సమద్ నవాబ్ సదర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.