రిజర్వేషన్ల పెంపుతో గిరిజన బిడ్డల జీవితాల్లో కొత్త వెలుగులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
కుల్కచర్ల, సెప్టెంబర్ 18(జనం సాక్షి):
గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచుతానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గిరిజనుల బిడ్డల చిరకాల కోరిక నెరవేరి వారి జీవితాల్లో కొత్త వెలుగులు వెలుగుతున్నాయని,రిజర్వేషన్లు సంబంధించిన జీవోను వారం, పది రోజుల్లో విడుదల చేస్తామనడం చారిత్రాత్మక నిర్ణయిం అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన కుల్కచర్ల మండలం కేంద్రంలో ఆదివారం మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ కు గిరిజన బిడ్డలంతా రుణపడి ఉంటారని, రిజర్వేషన్ల పెంపుతో గిరిజన బిడ్డలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎదుగుతారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు.దళిత బంధులాగే త్వరలో గిరిజనబంధు పథకాన్ని అమలుచేస్తామనడం విప్లవాత్మక నిర్ణయం, వీటితో గిరిజనులు ఆర్థికంగా సామాజికంగా అగ్రపథంలో నిలుస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిగి నియోజకవర్గ గిరిజనుల తరుపున డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Attachments area