రిమ్స్‌ ఉద్యోగుల ఆందోళనపై స్పందించని అధికారులు

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): పెండింగ్‌ వేతనాల కోసం రిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది సమ్మె చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా అధికారుల్లో చలనం లేదని సిఐటియు  పధాన కార్యదర్శి మల్లేష్‌ అన్నారు. గత 21 రోజులుగా సమ్మె చేస్తున్న వేతనాలు ఇప్పించడంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధ్యతా రహితమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు చికిత్సలు అందించడంలో ఇబ్బందులు అవుతున్న  ఉద్యోగుల సమ్మెను విరమింపచేయడంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి పెండింగ్‌ వేతనాలను చెల్లించి సమ్మెను విరమింపచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.