రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలం ఒడి కార్యక్రమం

రామారెడ్డి మండలం మోశoపూర్ గ్రామంలో  రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలం ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈసందర్భంగా వారుమాట్లాడుతూ,   బుధవారం రోజున రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు సాధించే సుస్థిర,  నూతన వ్యవసాయ పద్ధతులపై రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా రిసోర్స్ పర్సన్ దేవి సింగ్ రైతులకు అవగాహన కల్పించారన్నారు.. ఈ సందర్భంగా  అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ సదాశివ రెడ్డి మాట్లాడుతూ , ప్రస్తుతం వరి ఎదుగుదల దశలో ఉందని అగ్గి తెగుళ్లు, గోల్కా రోగం వంటి వ్యాధులు నివారించడానికి మందులను పిచికారి చేయాలన్నారు.  మన గ్రామానికి రిఫరెన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు వ్యవసాయ నిపుణులను తీసుకుని వచ్చి మన గ్రామాని కి రైతులకు అవగాహన కల్పించడం చాలా సంతోషకరమైన విషయమని అని అన్నారు.  అలాగే రైతులు తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి నానో యూరియా సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.  ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ నిపుణుల బృందం వారు రైతులకు తగు సలహాలు సూచనలు ఇచ్చినందుకు గ్రామం తరపున రిలయన్స్ ఫౌండేషన్ వ్యవసాయ నిపుణులు దేవి సింగ్ రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి సలావుద్దీన్ కి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు.  అనంతరం అదే గ్రామంలో వరి పొలానికి అగ్గి తెగులు వచ్చిందని అట్టి పొలాన్ని సందర్శించి అగ్గి తెగులు రోగం నివారణకు  సంబంధించిన మందులు పిచికారి చేయాలని రైతుకు తెలియజేయడం జరిగిందన్నారు. అక్కడ నే  సేంద్రియ ఎరువులు నానో యూరియా పై డెమో నిర్వహించడం జరిగిందన్నారు.