రీ డిజైన్లు దుబారా కాదా ..?

సిద్దిపేట,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుల్లో రీడిజైన్ల పేరుతో రూ.9 వేల కోట్లను దుర్వినియోగం చేశారని టిడిపి రైతు సంఘం నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు. మూడున్నరేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లేక, నకిలీ విత్తనాలు, అతివృష్టి అనావృష్టితో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సాగునీటి పథకాలకు రీటెండర్లు వేయాలన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.6 లక్షలు చెల్లించాలని, రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రెత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలోనే తెలంగాణ ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఉందని, ఈ విషయాన్ని నేషనల్‌ కైమ్స్ర్‌ రికార్డు బ్యూరో తెలియ జేసిందన్నారు.