రుద్రంగిలో ఫ్రీడం రన్ కార్యక్రమ నిర్వహణ
రుద్రంగి ఆగస్టు 11 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీక అమృత్ మహోత్సవాలలో భాగంగా గురువారం రుద్రంగిి ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ 2 కే రన్ కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థులు 2 కే రన్ లో పాల్గొనగా ప్రజాప్రతినిధులు అధికారులు జెండా ఉపి ప్రారంభించారు.ఇట్టి రన్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గట్ల మీనయ్య, ఎంపీడీవో శంకర్ నాయక్,సర్పంచ్ ప్రబలత మనోహర్,నాయకులు చేలుకల తిరుపతి,మంచే రాజేశం,యువకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.