రూ. 15 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

మెదక్‌: మానూరు మండలం ఎంకపల్లి శివారులో గంజాయి తోటలపై అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 15 కోట్ల విలువైన గంజాయిని గుర్తించారు. తోటలను ట్రాక్టర్లతోదున్నించి ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.