రూ.2 లక్షల విలువైన గంజాయి మొక్కల దహనం
మహబూబాబాద్,(జనంసాక్షి) మహబూబాబాద్ మండలంలోని మాధాపురం శివారు తూరువు తండాలో బుధవారం
సాయంత్రం ఎక్సౖెెజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పత్తి,మిర్చిపంట చేలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ద్వంసం చేశారు.తూరువు తండాలోని పలువురు రైతులు పత్తి మిర్చిలో అంతర పంటగా గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామచంద్రు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు చేసినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ తిరుపతి తెలిపారు ఈదాడుల్లో రూ.2 లక్షల విలువైన 1,116 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి, దహనం చేసినట్లు చెప్పారు .మొక్కలను సాగుచేసిన అదే తండాకు చెందిన అజ్మీర మోహన్,బోడ సేఠ్‌రాం ,బానోతు సత్తి అజ్మీరా వెంకన్న,సీమ్లా,శేఠ్‌రాంపై కేసులునమోదు చేసినట్లు వివరించారు ఈదాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ చంద్రమోహన్, ఎప్సైలు సనత్‌కుమార్,చంద్రశేఖర్, పాల్గొన్నారని చెప్పారు.