రూ.2,960 కోట్లతో రోడ్ల అభివృద్ధి : శిద్దా
కడప, మార్చి 22 : రాష్ట్రంలో రూ.2,960కోట్లతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు రవాణశాఖా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ప్రొద్దుటూరు పర్యటనకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ మరో రెండు నెలల్లో 350 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ప్రతీ జిల్లాలో డ్రైవింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి బస్టాండ్లను మోడల్ బస్టాండ్లగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.